Tag Archives: tdp leader

మహిళపై చేయిచేసుకున్న అశోక్‌గజపతిరాజు

కేంద్రమాజీమంత్రి అశోక్‌ గజపతిరాజు అమానుషంగా వ్యవహరించారు. ఓ మహిళపై చేయిచేసుకున్నారు. అందరూ చూస్తుండగానే మెడ వంచి మరీ కొట్టారు. దీంతో ఆ మహిళ అక్కడి నుండి వెళ్లిపోయింది. విజయనగరంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన పాల్గన్నారు. ఈక్రమంలోనే ఓ మహిళ తమ అభిమాన నేత అయిన అశోక్‌గజపతిరాజుపై పూలు చల్లారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అశోక్‌గజపతిరాజు ఆ మహిళను అందరూ చూస్తుండగానే కొట్టారు. దీంతో ఆమె అక్కడి నుండి వెళ్లిపోయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళను అవమానపరిచేలా అశోక్‌గజపతి రాజు వ్యవహరించారు.

Read More »

కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది.  తాజాగా కరోనా బారిన పడి టీడీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ శుక్రవారం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న  ఆయనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో  విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించి ఈరోజు ఉదయం ఆసుపత్రిలోనే కన్నుమూశారు. రామానుజయ స్వస్థలం కృష్ణా జిల్లా ...

Read More »