Tag Archives: tollywood news

ప్రేక్షకులను రప్పించడానికి శ్రమపడాలి : శరత్‌ కుమార్‌

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఘన విజయం సాధించిన వెబ్‌ సిరీస్‌ ‘పరంపర’ సీజన్‌ 2 వచ్చేసింది. ఈ వెటబ్‌ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సిరీస్‌ విడుదలవుతున్న సందర్భంగా నటుడు శరత్‌ కుమార్‌ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్‌ ఉన్న క్యారెక్టర్‌ ఈ సిరీస్‌లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా విలన్‌తో ఉండదు. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. ...

Read More »

‘డెడ్‌లైన్‌’ టీజర్‌ విడుదల

పరుచూరి గోపాలకృష్ణ శిష్యుడు, ‘లాంగ్‌ లాంగ్‌ ఎగో’ అనే డైలాగుతో గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు రమణారెడ్డి. ఆయన పలు చిత్రాల్లో నటించారు, దర్శకత్వం కూడా చేశారు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘డెడ్‌లైన్‌’. ఈ సినిమాలో తన పేరును బొమ్మారెడ్డి వి.ఆర్‌.ఆర్‌. అని తెరమీద వేసుకుంటున్నారు. అజయ్ ఘోష్‌, అపర్ణా మాలిక్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తాండ్ర గోపాల్‌ నిర్మించారు. సోమవారం హీరోయిన్‌ విజయశాంతి ‘డెడ్‌లైన్‌’ టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు రమణారెడ్డి నటుడిగా ఉన్నప్పటి నుండి తనకు పరిచయమని, అతనితో ...

Read More »

‘విక్రమ్‌ గౌడ్‌’ స్పెషల్‌ పోస్టర్‌

కన్నడ యంగ్‌ హీరో కిరణ్‌ రాజ్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘బడ్డీస్‌’తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘విక్రమ్ గౌడ్’ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.కుమారి సాయి ప్రియ సమర్పణలో మహేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై కణిదరపు రాజేష్, పి. ఉషారాణి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పాశం నరసింహారావు దర్శకులు. కిరణ్ రాజ్, దీపికా సింగ్ హీరో హీరోయిన్లుగా తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

Read More »

బోయపాటి, రామ్‌ సినిమా ప్రారంభం

రామ్‌ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాను బుధవారం ప్రారంభించారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్టాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు ...

Read More »

అరుదైన ఘనత ఆమెదే.. హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ ఆమె ఖాతాలోనే..!

సాయిపల్లవి హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ను సాధించి అరుదైన రికార్డును సాధించారు. అశేష అభిమానుల్లో తమదైన ప్రత్యేక ముద్రను పొందడానికి కథానాయికలు పడే పాట్లు ఇన్నీఅన్నీ కావు. ఈ విషయంలో వాళ్లు ఏళ్లతరబడి నానాతంటాలు పడుతూనే ఉంటారు. కొన్ని సార్లు భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించినప్పటికీ వారికంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం కష్టం. కానీ … నేచురల్‌ నటి సాయిపల్లవి మాత్రం చాలా సులభంగా తనదైన శైలిలో ప్రత్యేకతను సంతరించుకున్నారు.

Read More »

మాస్‌ లుక్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేస్తున్నారు. నేడు దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని మేకర్‌స విడుదల చేశారు. చేతిలో కత్తిని పట్టుకొని బాలయ్య మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ దునియా విజరు విలన్‌గా నటిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రమిది. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’అని చిత్ర యూనిట్‌ ...

Read More »

డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ఖాన్‌ కుమారుడికి క్లీన్‌ చిట్‌

 డ్రగ్స్‌ కేసులో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కి నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) శుక్రవారం క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.  ఆర్యన్‌ఖాన్‌, ఇతరుల వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని, అలాగే వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లు సరైన ఆధారాలు లేవంటూ ఎన్‌సిబి చార్జిషీట్‌లో పేర్కొంది. మరో 14 మందిపై చార్జిషీట్‌ నమోదు చేసింది. షారూఖ్‌ ఖాన్‌, ఆర్యన్‌ ఖాన్‌ ఇద్దరికి ఉపశమనం లభించిందంటూ న్యాయవాది ముఖుల్‌ రోహత్గి పేర్కొన్నారు. ”ఆర్యన్‌, అతడి తండ్రి షారుక్‌కు గొప్ప ఉపశమనం లభించినట్లయింది. నిజం ఇప్పటికైనా బయటపడింది. ఆర్యన్‌ వద్ద ఎలాంటి ...

Read More »

రెహమాన్‌ కొత్త చిత్రం

ఎ.ఆర్‌. రెహమాన్‌ ఇటీవల ’99 సాంగ్స్‌ అనే పాన్‌ ఇండియా మూవీని నిర్మించి, విడుదల చేశారు. తాజాగా వర్చువల్‌ రియాలిటీ మూవీ అయిన ‘లే మాస్క్‌’ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం జరుగుతున్న కాన్స్‌ ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. 75 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని అక్కడి వ్యూవర్స్‌ కోసం 36 నిమిషాలకు కుదించారు. రెహమాన్‌ భార్య సైరా ఇచ్చిన ఐడియాలో ఈ చిత్రం రూపుద్దికుంది. అంతర్జాతీయ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ, అత్యుత్తమ సాంకేతిక ...

Read More »

తమిళ హీరో ఉదయ నిధి స్టాలిన్ సంచలన నిర్ణయం

తమిళ స్టార్‌ హీరో ఉదయనిధి స్టాలిన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌ సినిమా ఇండిస్టీలో మంచి క్రేజ్‌, మార్కెట్‌ ఉన్న హీరోలలో ఆయన కూడా ఒకరు. త్వరలో ఆయన హీరోగా నటించిన ‘నెంజుకు నీధి’ అనే సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మే 20న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘ఆర్టికల్‌ 15’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కించారు.  సెల్వరాజ్‌ దర్శకత్వంలో ‘మామన్నన్‌’ సినిమాను చేస్తున్నారు. ఈ ...

Read More »

వెబ్‌సిరీస్‌తో సోనాలి బింద్రే రీ ఎంట్రీ

సోనాలి బింద్రే జీ5 ఓటీటీలో రాబోతున్న ‘ది బ్రోకెన్‌ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్‌ ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వినరు వైకుల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రచయిత మైక్‌ బార్ట్‌లెట్‌ కథను అందించారు. మీడియా ఛానళ్ల ఛాంబర్స్‌లో జరిగే సన్నివేశాలు ఆధారంగా సిరీస్‌ ఉండబోతుందని దర్శకుడు తెలిపారు. వార్తల కోసం జర్నలిస్టులు ఎదుర్కొనే సవాళ్లు, ఒత్తిళ్లుఇందులో చూపించనున్నారు. ఈ చిత్రంలో శ్రియా పిల్గావ్కర్‌, జైదీప్‌ అహ్లావత్‌, ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, తరుక్‌ రైనా, ఆకాష్‌ ఖురానా, కిరణ్‌ కుమార్‌ నటిస్తున్నారు.

Read More »