Tag Archives: vijay sai reddy

లోకేశ్.. ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని, జగన్ ను హత్య చేయడానికి పదునైన రాయితో కొట్టినట్లు చెప్పాడని వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పారు. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత లోకేశ్ వ్యంగ్యంగా చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ నీకు మెదడులో చిప్ లేదని అందరికీ తెలుసు. పశువుకంటే హీనంగా దిగజారిన నీకు సంస్కారం ...

Read More »

వేమిరెడ్డి రూ. 1000 కోట్లు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చుపెడతారట: విజయసాయిరెడ్డి

నెల్లూరు వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 1000 కోట్లు, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ అభ్యర్థి పి.నారాయణ రూ. 500 కోట్లు ఖర్చు పెడతారట అని ఆరోపించారు. ఎన్నడూ లేనంతగా నెల్లూరు జిల్లాలో డబ్బు రాజకీయాలను తీసుకొచ్చిన ఘనత టీడీపీ నేతలదేనని విమర్శించారు. టీడీపీ నేతలు ...

Read More »

ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో రాజకీయాలను నాయకులు రక్తికట్టిస్తున్నారు. టీడీపీ పేరు వింటేనే విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోమారు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ...

Read More »

షర్మిల చేసిన త‌ప్పు అదే: విజ‌య‌సాయి రెడ్డి

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌పై ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ష‌ర్మిల‌ తెలంగాణ‌లో పార్టీ పెట్టిన‌ప్పుడు తాము ఏమీ అన‌లేద‌ని, కానీ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో చేర‌డం ఆమె చేసిన రాజ‌కీయ త‌ప్పిదం అని అన్నారు. ఆమె వెనుక ఎవ‌రు ఉన్నారో కూడా అంద‌రికీ తెలుస‌ని విజ‌య‌సాయి అన్నారు. అలాగే సీఎం జ‌గ‌న్‌తో ష‌ర్మిల రాజ‌కీయంగా విభేదించిన మాట వాస్త‌వ‌మేన‌న్నారు. ఇక ఎన్‌డీఏలో వైసీపీ చేరిక‌పై కూడా ...

Read More »

టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందన్న విజయసాయిరెడ్డి

ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీ పెన్షన్లను ఆపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ… టీడీపీ వల్లే ఏపీలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. ఇది టీడీపీ నేతల మెంటాల్టీకి నిదర్శనమని చెప్పారు. తన బినామీలకు, ల్యాండ్ మాఫియా స్నేహితులకు చెల్లింపులు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ...

Read More »

మహీధర్ రెడ్డి తనకు చేసిన మేలు మర్చిపోలేను: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి ఊరు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కందుకూరులో పిలిస్తే పలికే దేవుడిగా మహీందర్ రెడ్డి అన్నను ప్రజలు కొలుస్తారని కొనియాడారు. ఆయన తనకు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. ఆయన తనకు గురువుతో సమానమని అన్నారు.

Read More »

చంద్రబాబు జీవితంలో మంచి రోజులు అయిపోయాయి: విజయసాయిరెడ్డి

టీడీడీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబులాంటి వ్యక్తికి ఓటు వేయొద్దని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని చెప్పారు. ఆయన జీవితంలో మంచి రోజులు అయిపోయాయని… తన కొడుకు లోకేశ్ ని ప్రమోట్ చేయడం, రిటైర్మెంట్ జీవితం కోసం డబ్బులు సంపాదించడమే ఇప్పుడు ఆయన ఏకైక అజెండా అని అన్నారు. తన ఆకాంక్షలే చచ్చిపోతే ఏపీ ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేర్చగలరని ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపును తీసుకురాగల స్థిరమైన యువ నాయకుడు కావాలని ...

Read More »

జెండా ఎగరడమే లక్ష్యంగా కష్టపడదాం…VSR

విజయసాయి రెడ్డి నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల పరిశీలకులు, కోఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేసి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఎంపీ స్థానమే కాకుండా ప్రతీ అసెంబ్లీ స్థానం గెలిచే విధంగా కష్టపడి పని చేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకోవల్సిన ప్రధాన బాధ్యత నియోజకవర్గ పరిశీలకులు, కోఆర్డినేటర్లపైనే ఉంటుందన్నారు. మీకు ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురండి. పోలింగ్‌కు బూత్ కమిటీలు చాలా కీలకం కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ...

Read More »

మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బీజేపీతో కలిశారు: విజయసాయిరెడ్డి

మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బీజేపీతో చంద్రబాబు చేతులు కలిపారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతించారని, సామాజిక – ఆర్థిక కులగణనను ఆపాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మళ్లీ నేషనల్ పెన్షన్ సిస్టమ్ వైపు వెళ్తారని చెప్పారు. మరోవైపు, రానున్న లోక్ సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయబోతున్నారు.

Read More »

ఈసారి ఎన్నికలు క్యాస్ట్ వార్ కాదు… క్లాస్ వార్: విజయసాయిరెడ్డి

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయ నేతలు మాటలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఈసారి జరగబోయే ఎన్నికలు కులాల మధ్య పోరు కాదని, వర్గాల మధ్య పోరు అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారం అంతా ఒక్కచోటే కేంద్రీకృతమై ఉండాలని కోరుకుంటున్న సంపన్నులకు, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్న సీఎం జగన్ వంటి వారికి మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. అధికారం కోసం అర్రులు చాస్తున్న పెత్తందార్లకు… రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా, పేదలు వారి కలలను సాకారం ...

Read More »