Tag Archives: vijayawada

కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించిన సీఎం జగన్

విజయవాడ ప్రజలకు అదిరిపోయే శుభవార్త. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్. కాసేపటి క్రితమే కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ ను ప్రారంభించారు సీఎం జగన్. విజయవాడ కృష్ణా నది దగ్గర రూ.12.3 కోట్లతో గోడ వెంబడి ఆహ్లాదకరంగా రివర్‌ ఫ్రంట్‌ పార్కును ప్రారంభించారు సీఎం జగన్. రూ.369.89 కోట్లతో నదిలో 2.26 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టింది జగన్ సర్కార్. కృష్ణా నది రిటైనింగ్‌ వాల్‌ కారణంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ముంపు భయం లేదు. ...

Read More »

నేడు విజయవాడకు సీఎం జగన్.. కారణం ఇదే..!

నేడు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాడేపల్లిలోని తన నివాసం నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరనున్నారు. ఆ తరువాత మొదటగా కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోని అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు సీఎం జగన్ శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకుఅందజేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత సీఎం జగన్ ...

Read More »

చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమైనా దేవుడా?: కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కిశోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవి పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు. “తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు… కానీ ఓడిపోయింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాడు… కానీ ఓడిపోయింది. ప్రశాంత్ కిశోర్ వీడియోను నేను కూడా చూశాను. నా దగ్గర డేటా లేదు కానీ, నాకెందుకో ...

Read More »

రామాలయాన్ని ప్రారంభించిన ముస్లిం వ్యక్తి!

రాముడి ఆలయాన్ని ఓ ముస్లిం వ్యక్తి ప్రారంభించిన ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని వించిపేటలో జరిగింది. కొత్తగా నిర్మించిన కోదండ రామస్వామి ఆలయాన్ని ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ షేక్ ఆఫిస్ ప్రారంభించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఆయన విరాళం ఇచ్చారు. ఆఫిస్ నుదుట బొట్టు పెట్టుకొని స్వామి వారికి వెండి ఆభరణాలు అందించి మతసామరస్యాన్ని చాటారు.

Read More »

కనకదుర్గమ్మను దర్శించుకున్న గోపీచంద్..

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ త్వరలో భీమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హర్ష దర్శకత్వంలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనపడబోతున్నాడట. ఇప్పటికే భీమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా ప్రజల్లో సినిమాపై అంచనాలు నెలకొంది. భీమా మార్చ్ 8న రిలీజ్ అవుతుండటంతో ప్రస్తుతం మూవీ యూనిట్ ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్స్ చేస్తూనే… మరోవైపు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా హీరో గోపీచంద్, మూవీ ...

Read More »

సిద్ధమవుతున్న పశ్చిమ బైపాస్..

విజయవాడ వాసులకు గుడ్‌ న్యూస్‌…విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఆవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. 2021లో ఈ బైపాస్ పనులు మొదలవగా….భూసేకరణలో సగం ఖర్చును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భరించింది. చెన్నై-కోల్కత్తా హైవేపై వెళ్లే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా బైపాస్ నిర్మించారు.

Read More »

విజయవాడలో కాల్పుల కలకలం.. యువకుడి హత్య

విజయవాడలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం అర్థరాత్రి నగర శివారు ప్రాంతం బైపాస్‌ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహేష్‌ అనే యువకుడి పై కాల్పులు జరిపి అక్కడి నుండి పరారయ్యారు. ఘటనా స్థలాన్ని విజయవాడ సిపి బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో అటెండర్‌గా మహేష్‌ పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నిందితులు పథకం ప్రకారమే మహేష్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు ...

Read More »

కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం వాయిదా

విజయవాడ కనకదుర్గ ఫైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణించడంతో వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని వాయిదా వేశారు. రూ.502 కోట్లతో రాజీవ్‌ గాంధీ పార్కు నుంచి పున్నమి ఘాట్‌ ...

Read More »