Tag Archives: ycp leader

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత ప్రశ్నల వర్షం..

ఆంద్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. 2014 నుంచి 2024 వరకు పవన్ ఎన్ని సినిమాలు చేశారు? అందులో ఎన్ని మూవీలు హిట్ సాధించాయి. ఎన్ని డిజాస్టర్లు అయ్యాయని పోతిన మహేశ్ ప్రశ్నించారు. ఆ సినిమాలకు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఎంత ట్యాక్స్ కట్టారు? ...

Read More »

సాంబశివరాజు మృతికి సీఎం జగన్‌ సంతాపం

రాజకీయ కురువృద్ధులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉంటూ, మచ్చలేని నాయకుడిగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన నాయకుడు సాంబశివరాజు అని సీఎం కొనియాడారు. ఆయన మరణం విజయనగరం జిల్లాతో పాటు, రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. పెనుమత్స సాంబశివరాజు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read More »

పీవీపీకి హైకోర్టులో ఊరట

బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసులో పారిశ్రామికవేత్త ప్రసాద్‌ వీర పొట్లూరి (పీవీపీ)కి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఈనెల 18 వరకు ఆయన్ను అరెస్టు చేయడం లాంటి చర్య లేవీ చేపట్టవద్దని న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి గురువారం ఆదేశించారు. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ పీవీపీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. తనపై కేసును కొట్టివేయాలని, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41–ఎ కింద నోటీసు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని, ...

Read More »