Tag Archives: ysrcp leader

రాజధాని ఫైల్స్ సినిమాకు షాక్… రిలీజ్కు బ్రేక్

రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 16 వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. సినిమాకు సంబధించి పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసింది. రాజధాని ఫైల్స్ సినిమా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ మంత్రి కొడాలి నాని సహా మరికొన్ని పాత్రల్ని అనుచితంగా చిత్రీకరించారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల ఆపేలా ...

Read More »

జనవరి 27న సీఎం జగన్ సభ… విజయవంతం చేయాలన్న మంత్రి బొత్స

శ్రీకాకుళం జిల్లాలో జనవరి 27న సీఎం జగన్ సభను విజయవంతం చేయాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తగరపువలస వేదికగా సీఎం జగన్ ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తానన్నారు. వైసీపీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులు చేశామని మంత్రి తెలిపారు. చేసిన పనులను ప్రజలకు తెలియజేయాలని… నియోజకవర్గంలో ఒక్కరికే టికెట్ వస్తుందన్నారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మనం కట్టుబడి పని చేయాలని మంత్రి వివరించారు.

Read More »