Tag Archives: yv subbareddy

నెల్లూరుకు కొత్త ఇంచార్జ్.. జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి..

వైసీపీ ఇంచార్జుల మరో జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇంచార్జులను ప్రకటించారు. నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జిగా విజయసాయిరెడ్డి ఖరారు అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే 8 జాబితాను విడుదల చేసిన అధిష్టానం తాజాగా 9వ విడత లిస్టును విడుదల చేసింది. కాగా వచ్చే ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ దూకుడు పెంచారు. 175 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు.

Read More »

ఏపీలో నోటాతో కాంగ్రెస్ పోటీ పడుతోంది: విజయసాయిరెడ్డి

కాంగ్రెస్ పార్టీపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ఏపీలో నోటాతో కలిసి ఐదో స్థానం కోసం కాంగ్రెస్ పోటీ పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల్లో 32,505 ఓట్ల తేడాతో నోటా చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని అన్నారు. గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటకల అనుభవంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా ఈజీగా చీలిపోతారని చెప్పారు. కాంగ్రెస్ కు వేసే ప్రతి ఓటు కూడా వేస్టేనని అన్నారు. ఎన్నికల్లో గెలిచే పార్టీకే ఓటు వేయాలని… వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఎక్స్ ...

Read More »