వెంకీమామ హంగామా షురూ.. దసరా గిఫ్ట్ రెడీ

వెంకీమామ హంగామా షురూ.. దసరా గిఫ్ట్ రెడీ

నిజ జీవితంలో మామా అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్యలు కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. గతంలో ప్రేమమ్ సినిమాలో కాసేపు ఈ ఇద్దరు కలిసి తెరపై కనిపిస్తేనే ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమాలో మామా, అల్లుళ్ళుగా అదరగొట్టబోతున్నారు. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక జైలవకుశ సినిమా తరువాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై పాజిటివ్ కార్నర్ ఏర్పడడానికి ఇది కూడా ఒక కారణం. వెంకటేష్ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, చైతూకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నిజానికి ఈ సినిమాని ముందుగా దసరా సీజన్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సైరా రిలీజ్ పక్కా అని తేలడంతో ఈ సినిమాని డిసెంబర్‌కి వాయిదా వేశారు. అయితే విజయదశమి పండుగ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు వెంకీమామ ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పల్లెటూరి వాతావరణంలో ఓ ట్రాక్టర్‌పై వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టర్ చూసిన అక్కినేని, దగ్గుబాటి హీరోల అభిమానులు మామా అల్లుళ్లు సూపర్ అని మురిసిపోతున్నారు. అలాగే పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా ఇద్దరూ కూడా ట్రెడిషనల్ వేర్‌లో కనిపిస్తున్నారు. పోస్టరే చాలా కలర్ ఫుల్ గా ఉండడంతో రేపు రాబోయే వీడియో కంటెంట్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*