Mana Aksharam
  • Home
  • News
  • Crime
  • గుంటూరులో మరో దారుణం:మైనర్ బాలికపై అత్యాచారయత్నం
Andhra Crime Headlines Homepage-Slider News

గుంటూరులో మరో దారుణం:మైనర్ బాలికపై అత్యాచారయత్నం

youth-rape-attempt-victim-relatives-attack-on-police-station

గుంటూరులో మరో దారుణం:మైనర్ బాలికపై అత్యాచారయత్నం

గుంటూరులో మరో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. దీంతో నిందితుడుని పట్టుకుని ఉరి తీయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బాలిక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పాత పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసం ఉండే రఘురామ్ అనే యువకుడు తన పక్క ఫ్లాటులో ఉండే మైనర్ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. మంగళవారం సాయంత్రం ఆడుకుంటున్న చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక కేకలు వేడయడంతో భయపడి ఆమెను వదిలేశాడు. బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు నేరుగా స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఇదే సమయంలో నిందితుడిని తమకు అప్పగించాలని బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం జియావుద్దీన్‌, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎండీ హిదాయత్‌, టీడీపీ నేతలు, మత పెద్దలు అక్కడకు చేరుకుని పోలీసులతో చర్చలు జరిపారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అనంతరం వారు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. స్టేషన్‌ వద్ద పరిస్థితులు హింసాత్మకంగా మారి, ఒక్కసారిగా అల్లర్లు చెలరేగడానికి సంఘ విద్రోహ శక్తులే కారణమని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

Related posts

పవర్‌స్టార్‌ని కాదు.. ప్రజా సేవకుడిని: పవన్

Manaaksharam

చంద్రబాబును కలిసిన ఈటల రాజేందర్‌

admin

సీమలో మళ్ళీ జనసేన శిబిరాలు!

admin

Leave a Comment