Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • కోడికత్తి కేసులో స్పీడ్ పెంచిన ఎన్ఐఏ
Andhra Homepage-Slider News Politics

కోడికత్తి కేసులో స్పీడ్ పెంచిన ఎన్ఐఏ

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. నిన్న రాత్రి శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి తీసుకొచ్చిన అధికారులు రాత్రంతా విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు. అనంతరం ఈరోజు ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ జరిపేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ విషయంలో లోతుగా జరపాల్సిన అవసరం ఉందని వివరించారు.వాదనలు విన్న న్యాయమూర్తి.. శ్రీనివాసరావును ఈ నెల 25 వరకూ ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

Related posts

నేడు గుంటూరులో పార్టీ కార్యలయం ప్రారంభం ,భారీ బహిరంగ సభ …

Manaaksharam

జియో ఫోన్‌ ఇలా బుక్  చేసుకోవచ్చు.. 

ashok p

రాజకీయాల్లోకి రాజు గారి కుమార్తె!

ashok p